పుష్పలో మరింత పవర్ఫుల్ గా రంగమ్మత్త! - TollywoodBoxoffice.in

Exclusive Portal for Tollywood Boxoffice

పుష్పలో మరింత పవర్ఫుల్ గా రంగమ్మత్త!


జబర్దస్త్ గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ సినిమా ఆఫర్లు ఎన్ని వస్తున్నా కూడా ప్రతీ దానికి ఓకే చేయడం లేదు. కేవలం తనకు నచ్చిన పాత్రలకు మాత్రమే ఓకే చెబుతోంది. రంగస్థలం సినిమాలో కూడా రంగమ్మత్తగా నటించడానికి కాస్త ఆలోచించింది. కానీ సుకుమార్ మీద నమ్మకంతో ఓకే చేయడంతో మంచి క్రేజ్ దక్కింది.

ఇక మరోసారి ఆమె సుకుమార్ మీద నమ్మకంతోనే పుష్ప సినిమాలో కూడా ఒక పవర్ఫుల్ పాత్రలో నటించడానికి ఒప్పుకుంది. ఆ పాత్ర రంగమ్మత్త కంటే పవర్ఫుల్ గా ఉంటుందని సమాచారం. మరి సినిమాలో ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి. రీసెంట్ గా పుష్ప షూటింగ్ మొదలవ్వగా శుక్రవారం రోజు అనసూయా కూడా సెట్స్ లోకి వెళ్లింది. ఆమె పాత్రకు సంబంధించిన సీన్స్ మరో రెండు రోజుల్లో ఫీనీష్ అవుతాయట. ఇక పుష్ప సినిమా మొదటి పార్ట్ ను ఈ ఏడాది చివరలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.