RC15: శంకర్ రెమ్యునరేషన్.. హీరోతో సమానంగా..?


సంచలన దర్శకుడు శంకర్ రెమ్యునరేషన్ ఏ స్థాయిలో ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా బడ్జెట్  లెక్కలతోనే షాక్ ఇస్తుంటారు. ఇక రామ్ చరణ్ 15వ సినిమాకు కూడా ఆయనకు సాలీడ్ రెమ్యునరేషన్ అందుతున్నట్లు సమాచారం.

RRR సినిమాకు రామ్ చరణ్ 30కోట్ల వరకు అందుకుంటున్నాడు. ఇక దిల్ రాజు సినిమాకు ఇంకాస్త ఎక్కువ అందుకునే అవకాశం లేకపోలేదు. అయితే ఆ సినిమాకు దర్శకుడైన శంకర్ 40కోట్లకు పైగా అందుకుంటున్నట్లు సమాచారం. దాదాపు రామ్ చరణ్ కూడా అదే రేంజ్ లో ఇస్తున్నట్లు టాక్. శంకర్ 2.ఓ అంతగా సక్సెస్ అవ్వకపోయినా కూడా ఆయన రేంజ్ కొంత కూడా తగ్గలేదు. అలాగే మరోవైపు ఇండియన్ 2కూడా రెమ్యునరేషన్ గోడవతోనే ఆగిపోయింది. ఇక RC 15వ కోసం శంకర్ భారీగా అందుకుంటున్నట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post