2022 పవర్ఫుల్ మూవీస్.. క్లిక్కయితే రికార్డులే!


టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. కరోనా లేకపోయి ఉంటే ఈపాటికే రెండు ముఖ్యమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేవి. ఇక సెకండ్ వేవ్ అనంతరం పవన్ నెవర్ బిఫోర్ అనేలా షూటింగ్స్ తో బిజీ కానున్నాడు. అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది మూడు సినిమాలు రావచ్చట.

అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ సినిమాను 2022 సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు. ఇక క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాను సమ్మర్ లో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోయే సినిమాను 2022 చివరలో రిలీజ్ చేయవచ్చని సమాచారం. ప్రస్తుతం షూటింగ్ ప్లాన్స్ అయితే కరెక్ట్ గా సెట్టయ్యాయి. అది కరెక్ట్ గా కంటిన్యూ అయితే వచ్చే ఏడాది పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పండగే అని చెప్పవచ్చు.


Post a Comment

Previous Post Next Post