మా ఎన్నికల్లో నా సపోర్ట్ అతనికే.. క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ!


‘మా’ఎన్నికలపై మొదటిసారి నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఆయన ఎవరికి మద్దతు ఇస్తారా అని అనుకుంటున్న తరుణంలో మంచు విష్ణుకు సపోర్ట్ చేస్తున్నాను అంటూ మొత్తానికి ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఇన్నాళ్లు మా టీమ్ లో పని చేసిన వారిపై కూడా బాలయ్య గట్టిగానే కౌంటర్స్ వేశారు.

తెలంగాణ సర్కార్‌తో రాసుకుపూసుకు తిరుగుతున్నారు, ‘మా’కు శాశ్వత భవనాన్ని ఇంతకాలం ఎందుకు నిర్మించలేకపోయారు..? ‘మా’ బిల్డింగ్ కోసం అడిగితే ఒక్క ఎకరం భూమిని కూడా ఇవ్వరా..?.అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతే కాకుండా ‘మా’ ఎన్నికల విషయంలో లోకల్‌, నాన్‌ లోకల్‌ అనే అంశాన్ని పట్టించుకోను. మనది గ్లామర్ ఇండస్ట్రీ.. మన సమస్యల్ని బహిరంగంగా చర్చించడం సరికాదు. ‘మా’ భవన నిర్మాణానికి ముందుకొచ్చిన మంచు విష్ణుకు సహకరిస్తాను అని తెలియజేశారు.


Post a Comment

Previous Post Next Post