ఒకేసారి 10కోట్లు ఖర్చు పెట్టిన సోనూసూద్!


వెండితెర విలన్ గా ఒకప్పుడు మంచి క్రేజ్ అందుకున్న సోనూసూద్ ప్రస్తుతం రియల్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఎంతోమందికి సహాయలు అందించిన సోనూసూద్ మరోవైపు సినిమాల్లో కూడా పాజిటివ్ రోల్స్ తో ఆకట్టుకుంటున్నాడు.

సోనూసూద్ చేస్తున్న మంచి పనుల వలన టాలీవుడ్ లో అతనికి లీడ్ రోల్స్ లో నటించే ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ఇక మొన్నటివరకు హైదరాబాద్ లో ఉండడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపని సోనూసూద్ ఇప్పుడు మరింత బిజీ కావడంతో ఒక ఇల్లుని కొనేసినట్లు తెలుస్తోంది. ఎక్కువ కాలం ఇక్కడే 
 కుటుంబ సభ్యులతో కలిసి ఉండేలా అందమైన ఇంటిని నిర్మించుకున్నారట. అందుకోసం ఈ బాలీవుడ్ స్టార్ 10కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. సోనూసూద్ రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచినట్లు సమాచారం.

Post a Comment

Previous Post Next Post