ఎవరు మీలో కోటీశ్వరులు.. ఫస్ట్ సెలబ్రెటీ గెస్ట్ ఎవరంటే?


జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరికచబోతున్న ఎవరు మీలో కోటీశ్వరులు మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ షోకు ప్రతి వారం ఒక స్పెషల్ గెస్ట్ వస్తారట. ఇక మొదటి ఎపిసోడ్ కు వచ్చే స్టార్ సెలబ్రేటి ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే షోకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  హోస్ట్ గా రాబోతున్నట్లు కధనాలు వెలువడుతున్నాయి. RRRలో కలిసి నటిస్తున్న ఈ స్టార్స్ మొదటి ఎపిసోడ్ లో బుల్లితెరపై కలిసి షోలో కనిపిస్తే ఆ కిక్కు మామూలుగా ఉండదు. షోను ఎన్టీఆర్ సొంత ప్రొడక్షన్ లోనే కొనసాగిస్తున్నాడు. దీంతో రేటింగ్ ఎంత పెరిగితే తారక్ ఆ స్థాయిలో లాభాలు అందుకోవచ్చు. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. ఇక రీసెంట్ గా విడుదలైన మేకింగ్ వీడియో RRR సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.


Post a Comment

Previous Post Next Post