హీరోగా దేవి శ్రీ ప్రసాద్.. ఇప్పుడైనా పట్టాలెక్కుతుందా?


టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అంటే తెలియని వారు ఉండరు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు రాక్ స్టార్ బ్యాండ్ కు చిందులు వేయాల్సిందే. ఎలాంటి సాంగ్స్ అయినా ఈజీగా కనెక్ట్ అయ్యేలా చేసే దేవి నటుడిగా మారబోతున్నాడని మరోసారి టాక్ నడుస్తోంది.

గతంలోనే సుకుమార్ దర్శకత్వంలో హీరోగా చేయడానికి రెడీ అయినప్పటికీ ఎందుకో వర్కౌట్ కాలేదు. ఇక ఇన్నాళ్లు ఛార్మి నిర్మాతగా దేవి హీరోగా సినిమా చేస్తారని కథనాలు వెలువడుతున్నాయి. ఛార్మి పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడైనా దేవి శ్రీ ప్రసాద్ హీరోగా మొదటి మూవీ పట్టాలెక్కుతుందో లేదో చూడాలి. ఇక దేవి సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.


Post a Comment

Previous Post Next Post