తాప్సి రూ.40కోట్ల వరకు వచ్చిందా? - TollywoodBoxoffice.in

Exclusive Portal for Boxoffice Collections

తాప్సి రూ.40కోట్ల వరకు వచ్చిందా?


ఝుమ్మంది నాథం సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన సొట్టబుగ్గల సుందరి తాప్సి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాడానికి చాలా సమయం పట్టింది. తెలుగులో అయితే ఆమెకు చెప్పుకోదగ్గ హిట్స్ పడలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా మంచి సినిమాల్లో ఛాన్స్ అందుకుంటోంది.

పింక్, తప్పడ్ వంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక గత ఏడాది కోటి వరకు రెమ్యునరేషన్ అందుకున్న తాప్సి ఇప్పుడు 2కోట్లను టచ్ చేసినట్లు సమాచారం. చిన్న బడ్జెట్ లో మంచి కథలు వచ్చినప్పుడు కోటి కంటే తక్కువ ఇచ్చినా కూడా అడ్జస్ట్ చేసుకుంటోంది. ఇక వివిధ రకాల బ్రాండ్స్ యాడ్స్ లలో కూడా నటిస్తోంది. దీంతో అమ్మడు ఏడాదిలో 40కోట్లకు పైగానే ఆదాయాన్ని అందుకుంటున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం మిథాలి రాజ్ బయోపిక్ లో నటిస్తున్న తాప్సి ఆ సినిమాతో హిట్టు కొడితే రెమ్యునరేషన్ ను ఇంకాస్త పెంచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.