పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్!


టాలీవుడ్ లో ప్రస్తుతం రెగ్యులర్ హీరోయిన్ గా కొనసాగుతున్న మెహ్రీన్ పిర్జాదా ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. ఆమె పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నట్లు చాలా క్లియర్ గా వివరణ ఇచ్చింది.
భవ్యా బిష్ణోయ్ తో పెళ్లి చేసుకోవటానికి సిద్దమైన మెహ్రీన్  అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్న క్రమంలో బ్రేకప్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

స్నేహపూర్వకంగా తీసుకున్న నిర్ణయమే అంటూ పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదని అమ్మడు కుండబద్దలు కొట్టేసింది. నా హృదయపూర్వకంగానే చెబుతున్నాను. ఇక నుండి నాకు భవ్య బిష్ణోయ్ తో గాని అలాగే అతని కుటుంబ సభ్యులతో స్నేహితులతో ఎవరితోనూ సంబంధం లేదు. దీనికి సంబంధించి నేను చేస్తున్న ఏకైక ప్రకటన ఇది. ఇది చాలా ప్రైవేట్ విషయం కాబట్టి ప్రతి ఒక్కరూ నా ప్రైవసీని గౌరవిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇక ఎప్పటిలానే సినిమాల్లో కొనసాగుతనని  అంటూ.. మెహ్రీన్ పిర్జాదా వివరణ ఇచ్చింది.

Post a Comment

Previous Post Next Post