మరో మంచి దర్శకుడితో నాగచైతన్య!


అక్కినేని యువ హీరో నాగ చైతన్య ఈ మధ్య కాలంలో ఇంట్రెస్టింగ్ సినిమాలను లైన్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి సినిమా చేసినా కూడా కాస్త డిఫరెంట్ గా ఉండాలని ఆలోచిస్తున్న చైతు కోసం టాలెంటెడ్ దర్శకులు కూడా ఎగబడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో అమీర్ ఖాన్ లాంటి హీరోతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సిద్దమైన విషయం తెలిసిందే.

లాల్ సింగ్ చద్దా అనే సినిమాలో చైతన్య పాత్ర సరికొత్తగా ఉంటుందని సమాచారం. ఇక లవ్ స్టొరీని విడుదలకు సిద్దం చేసిన చైతూ ఎక్కువగా థాంక్యూ సినిమాతోనే బిజీ బిజీగా గడుపుతున్నాడు. విక్రమ్ కె కుమార్ ఆ సినిమాను డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక నేను శైలజా దర్శకుడు కిషోర్ తిరుమలతో కూడా ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆ దర్శకుడు చివరగా రామ్ తో రెడ్ సినిమా చేశాడు. ఇక నాగచైతన్య పరశురామ్ తో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా మహేష్ SVP అనంతరం మొదలవుతుంది.


Post a Comment

Previous Post Next Post