శంకర్ - రామ్ చరణ్.. ఇక మొదలైనట్లే! - TollywoodBoxoffice.in

Exclusive Portal for Tollywood Boxoffice

శంకర్ - రామ్ చరణ్.. ఇక మొదలైనట్లే!


ఇండియాలోనే టాప్ దర్శకుల్లో ఒకరైన శంకర్ ఒకప్పుడు సినిమాను సెట్స్ పైకి తీసుకు వస్తే ఫినిష్ చేసే వరకు మరో సినిమాను టచ్ చేసేవారు కాదు. కానీ ఇండియన్ 2 విషయంలో ఆయన ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని ఇన్ని కావు. నిర్మాణ సంస్థ లైకా బడ్జెట్ లెక్కలతో శంకర్ పై ఆరోపణలు చేసి రెమ్యునరేషన్ కూడా తగ్గించింది. చిరాకు పడిన శంకర్ రామ్ చరణ్ తో మరొక సినిమాను ఎనౌన్స్ చేశాడు.

సరైన బడ్జెట్ సెట్ చేస్తేగాని సినిమాను పూర్తి చేయలేనని ఇండియన్ 2ను పక్కన పెట్టిన శంకర్ భవిష్యత్తు ప్రాజెక్టులపై వెంటవెంటనే క్లారిటీ ఇచ్చాడు. ఇక ఇప్పటికే ఇండియన్ 2 సినిమాకు 180కోట్లకు పైగా ఖర్చయ్యింది. ఇక లైకా శంకర్ రెమ్యునరేషన్ ను తగ్గించడానికి ప్రయత్నం చేసినా వర్కౌట్ కాలేదు. ఇక కోర్టు వరకు విషయం వెళ్లగా చర్చలతో కూడా సమస్య తీరలేదు. అయితే ఇటీవల కోర్టు శంకర్ ను సమర్థిస్తూ లైకా ఆరోపణలు కొట్టివేసినట్లు సమాచారం. దీంతో రామ్ చరణ్ సినిమాకి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఆ సినిమాను మరికొన్ని నెలల్లో మొదలు పెట్టవచ్చని కూడా టాక్ వస్తోంది.