NTR30: ఎన్టీఆర్ - కొరటాల కెరీర్ లోనే హైయ్యెస్ట్ బడ్జెట్!


ఆచార్య సినిమాకు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్న దర్శకుడు కొరటాల శివ ఆ పనులు పూర్తవ్వగానే వెంటనే ఎన్టీఆర్ సినిమాను సెట్స్ పైకి తీసుకు రావాలని అనుకుంటున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా కొరటాల మొదటిసారి చేయనున్న పాన్ ఇండియా సినిమా కావడంతో బడ్జెట్ కూడా గట్టిగానే ఉంటుందట.

జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి చేస్తున్న RRR సినిమాకు 450కోట్ల వరకు ఖర్చవుతోంది. ఇక సోలో హీరోగా చూసుకుంటే తారక్ ఇప్పటివరకు 150కోట్ల బడ్జెట్ తో సినిమా చేసింది లేదు. ఇక 30వ సినిమా కోసం మాత్రం దాదాపు 200కోట్ల వరకు ఖర్చవుతుందట. కేవలం కొరటాల శివ కెరీర్ లోనే కాకుండా ఎన్టీఆర్ సినమలలో కూడా ఇది హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ. పాన్ ఇండియప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ఇండియన్ టాప్ స్టార్స్ ప్రధాన పాత్రలో నటించే అవకాశం ఉంది. మరి సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post