బహుబలి3: గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నయనతార?


ఇండియన్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన బాహుబలి వెబ్ సిరీస్ గా రానున్నట్లు గత రెండేళ్ల నుంచి చెబుతున్నారు. కానీ ఎంత ప్లాన్ చేసినా కూడా ఆ సిరీస్ ప్లాన్ సక్సెస్ అవ్వడం లేదు. ఇదివరకే ప్రవీణ్ సత్తారు, దేవకట్టా వంటి టాలెంటేట్ దర్శకులతో  నెట్ ఫ్లిక్స్ బిఫోర్ ద బిగినింగ్ అంటూ షూటింగ్ స్టార్ట్ చేసింది.

సగానికి పైగా షూటింగ్ పూర్తయిన అనంతరం మళ్ళీ క్యాన్సిల్  చేసి మరొక తమిళ దర్శకుడితో ప్లాన్ చేస్తున్నారు. ఇక నయనతార అందులో ఒక పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనుష్క చేసిన దేవసేన పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక టాక్ అయితే వస్తోంది. మరి ఆమె ఎంతవరకు న్యాయం చేస్తుందో చూడాలి. ఇక పార్ట్ 3లో దేవసేన రాజ్యానికి సంబంధించిన కీలక సన్నివేశాలను చూపించబోతున్నట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post