అమీర్ ఖాన్ ను కలిసిన నాగచైతన్య!


ఇటీవల డివోర్స్ న్యూస్ తో వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచిన అమీర్ ఖాన్ మళ్ళీ షూటింగ్ తో బిజీ అయ్యాడు. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ సినిమాకు రీమేక్ గా వస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమా షూటింగ్ గురువారం ముంబైలో మొదలైంది. ఇక ఈ సినిమాలో నాగచైతన్య కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు.

చైతు ఆర్మీ ఆఫీసర్ పాత్రలో అమీర్ ఖాన్ క్యారెక్టర్ కు క్లోజ్ ఫ్రెండ్ గా కనిపించనున్నాడట. ఇక సినిమా కోసం సాలీడ్ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. మొదట ఆ క్యారెక్టర్ కోసం విజయ్ సేతుపతిని అనుకున్న విషయం తెలిసిందే. అయితే అతను బిజీగా ఉండడం వలన ఓకే చేయలేకపోయాడు. ఇక చైతన్య ఆర్మీ ఫ్రెండ్ గా పర్ఫెక్ట్ గా సెట్టయినట్లు తెలుస్తోంది. ఇక నేడు మొదలైన ఈ సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. వచ్చే ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు రావచ్చని తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post