RRR - RC15 - NTR 30.. ఏదో తేడాగా ఉందేంటి?


రాజమౌళి సినిమాల బ్యాడ్ సెంటిమెంట్ తో రామ్ చరణ్ - శంకర్ సినిమాపైనే కాకుండా ఎన్టీఆర్ కొరటాల శివ ప్రాజెక్టుపై కూడా మీమ్స్ వస్తున్నాయి. రాజమౌళి హీరోలు ఆయనతో సినిమా చేసిన అనంతరం వేరే సినిమాలు చేస్తే డిజాస్టర్ ఎదుర్కొన్నట్లు గత ఆనవాళ్ళు చెబుతున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1 తరువాత సుబ్బు చేశాడు. సింహాద్రి అనంతరం ఆంధ్రవాలా. ఇక నితిన్ సై తరువాత సరదా బుల్లోడు. ప్రభాస్ ఛత్రపతి అనంతరం పౌర్ణమి. రవితేజ విక్రమార్కుడు - ఖాతార్నాక్, యమదొంగ - కంత్రి. రామ్ చరణ్ మగధీర - ఆరెంజ్. సునీల్ మర్యాద రామన్న - అప్పల్రాజు. నాని ఈగ - ఎటో వెళ్లిపోయింది మనసు. బాహుబలి - సాహో... ఇలా రాజమౌళి సినిమాల అనంతరం హీరోలు అపజయాలు ఎదుర్కోవడంలో RRR అనంతరం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలపై కూడా ఏదో తేడాగా ఉందే అనే మీమ్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఈ బ్యాడ్ సెంటిమెంట్ కి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post