నారప్ప, దృశ్యం2, విరాటపర్వం.. సాలీడ్ డీల్స్!


టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ ఓటీటీ బిజినెస్ ఊపందుకుంటోంది. ఫైనల్ గా బడా నిర్మాతలు కూడా రిస్క్ చేయలేక పెద్ద సినిమాలను డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఇక నారప్ప సినిమా అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమా హక్కులను ఆ సంస్థ 40కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఇక సురేష్ ప్రొడక్షన్స్ లోనే తెరకెక్కిన మరో సినిమా దృశ్యంకు డిజిటల్ మార్కెట్ పరంగా మంచి లాభాలు అందినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను థియేటర్స్ లోనే విడుదల చేయాలని అనుకున్నప్పటికి. ఓటీటీ శాటిలైట్ హక్కులను 36కోట్లకు హాట్ స్టార్ దక్కించుకున్నట్లు సమాచారం. ఇక రానా సాయి పల్లవి నటించిన విరటపర్వం సినిమాకు కూడా భారీ స్థాయిలో ఆఫర్స్ వస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్ డైరెక్ట్ రిలీజ్ కోసం ఏకంగా 50కోట్ల ఆఫర్ ను ప్రకటించారట. అయితే నిర్మాతలు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.


Post a Comment

Previous Post Next Post