గీత ఆర్ట్స్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం!


హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఉన్న గీతా ఆర్ట్స్ కార్యాలయంలో సునీతా బోయా అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. సినిమాల్లో అవకాశాల పేరిట నిర్మాత బన్నీ వాసు తనను మోసం చేశాడని సునీత ఆరోపించింది. సునీత దిని గురించి బన్నీ వాస్‌పై జూబ్లీ హిల్స్ పోలీసులకు దాదాపు నాలుగు సార్లు ఫిర్యాదులు చేశారు.

సునీత కు తెలుగు పరిశ్రమతో కొన్ని పరిచయాలు ఉన్నాయి. ఇక సునీతను ఇదివరకే రెండుసార్లు అరెస్టు చేశారు, ఆమెను ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో కూడా చేర్పించారు.  ఒక వారం క్రితం ఆమె ఇంటర్నెట్లో బన్నీ వాస్ తనను బెదిరిస్తున్నాడని గీతా ఆర్ట్స్ ఆఫీసు ముందు ఆత్మహత్యాయత్నం చేసుకుంటానని వీడియోను పోస్ట్ చేసింది. ఇక ఆమె గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకుని హడావుడి చేయడంలో మేనేజర్‌ చూసి పోలీసులకు పిర్యాదు చేశాడు. ఇక ఆమెను అరెస్టు చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు తరువాత సునీతను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఆమె మానసిక స్థితి స్థిరంగా లేదని న్యాయమూర్తికి సమాచారం ఇచ్చారు. అలాగే ప్రభుత్వ వైద్య కేంద్రంలో కౌన్సిలింగ్ కోసం ఆమెను పంపమని అభ్యర్థించారు.


Post a Comment

Previous Post Next Post