RRR మేకింగ్ వీడియో: హమ్మయ్య.. కంగారు పడాల్సిన అవసరమే లేదు!


టాలీవుడ్ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ RRR కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోతో అంచనాల డోస్ ను మరింత పెంచేశారు. ముఖ్యంగా సినిమా అక్టోబర్ 13న వస్తుందా రాదా అనే విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేశారు.

సినిమాను అక్టోబర్ 13న రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పేశారు. దీంతో అభిమానుల్లో ఆనందం మొదలైంది. ఇక రొర్ ఆఫ్ RRRకు కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ మేయిన్ హైలెట్ అని చెప్పవచ్చు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు తగ్గట్లుగానే సాలీడ్ బ్యాక్  గ్రౌండ్ మ్యూజిక్ ను అందించారు. సినిమాలో వాటర్ ఫైర్ యాక్షన్ సీన్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నట్లు క్లారిటీగా అర్ధమయ్యింది. మరి కొమరం భీమ్ , అల్లూరి సీతారామరాజు  బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.


Post a Comment

Previous Post Next Post