Nithin to romance Pooja Hegde?


మాస్ట్రో సినిమాతో సిద్ధమవుతున్న నితిన్ మరో డిఫరెంట్ సినిమాను లైన్ లో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కిక్, టెంపర్ వంటి కథలను అందించిన రైటర్ వక్కంతం వంశీతో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వరుస పరాజయాల అనంతరం నితిన్ ఎలాగైనా మళ్ళీ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు.

చివరగా చేసిన చెక్, రంగ్ దే సినిమాలు డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇక అందాదున్ రీమేక్ మాస్ట్రోతో హిట్ కొట్టడానికి రెడీగా అవుతున్నాడు. అయితే ఆ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలోనే విడుదల చేయాలని చూస్తున్నారు. ఇక వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం పూజా హెగ్డేను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఆల్ మోస్ట్ కథ కూడా ఫైనల్ అయ్యిందట. ఇక త్వరలోనే ఈ కాంబినేషన్ పై అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్ ఇవ్వనున్నారు.


Post a Comment

Previous Post Next Post