ఒక్క ఫోన్ కొడితే.. ప్రభాస్‌తో మరో మూవీ!

 


బాహుబలి లాంటి సక్సెస్ అనంతరం ప్రభాస్ డేట్స్ ఇస్తే సినిమా చేయడానికి ఎంతోమంది అగ్ర దర్శకులు సిద్ధంగా ఉండేవారు. కానీ డార్లింగ్ మాత్రం రెండేళ్లకు పైగా కష్టపడి స్క్రిప్ట్ సిద్ధం చేసిన సుజిత్ కోసం చాలా సింపుల్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. యూవీ క్రియేషన్స్ కూడా అతన్ని గట్టిగానే నమ్మింది. కానీ అభిమానులే కాస్త షాక్ అయ్యారు.


సినిమా హిట్టా ఫట్టా అని తెలకుండానే కన్ఫ్యూజన్ లో పడేశారు. మొత్తానికి కలెక్షన్స్ పరంగా ప్రభాస్ బ్రాండ్ తో నష్టాల భారిన పడలేదు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు సుజిత్ ప్రభాస్ తో ఉన్న అనుబంధం గురించి చెబుతూ.. మరో సినిమా చేయాలని ఉందని అంటే వెంటనే కథ వినడానికి ఒప్పుకుంటాడని చెప్పాడు. ప్రభాస్ అన్నకు తనపై చాలా నమ్మకం ఉందని కథ చెప్పడానికి ఫోన్ కాల్ మాత్రమే దురమని చెప్పాడు. చాలా మందికి అలాంటి ఛాన్స్ కూడా లేదని అంటూ తనపై మాత్రం ప్రభాస్ అన్నకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందని చెప్పాడు.

Post a Comment

Previous Post Next Post