డేట్స్ అడ్జస్ట్ చేయలేక తలపట్టుకున్న ఆర్టిస్టులు!


సెకండ్ వావ్ అనంతరం దాదాపు అందరు వ్యాక్సిన్  వేయించుకున్నారు. దీంతో లాక్ డౌన్ ఎత్తివేయగానే ఇండస్ట్రీలో దాదాపు అన్ని సినిమాల షూటింగ్స్ షూటింగ్స్ స్టార్ట్ చేసేశారు. అంతా బాగానే ఉంది గాని ప్రస్తుతం ఆర్టిస్టులు దొరకడం చాలా కష్టంగా మారింది. సైడ్ రోల్స్ చేసే నటీనటులు కూడా సమయానికి దొరకడం లేదట.

ఎందుకంటే అన్ని షూటింగ్స్ ఓకేసారి పట్టాలెక్కడంతో ఆర్టిస్టులు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నారట. కొందరైతే మూడు షిఫ్టులకు ఓకే చెప్పినప్పటికీ వర్కౌట్ కావడం లేదట. ఒకరు ఫ్రీగా ఉంటే మరొకరు దొరకడం కష్టంగా మారినట్లు తెలుస్తోంది. ఇటీవల పుష్ప ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేయగా ఇద్దరు ఆర్టిస్టులు హ్యాండ్ ఇచ్చారట. అందుకే షూటింగ్ ను మరుసటి రోజు స్టార్ట్ చేశారు. మరి ఈ గజిబిజి వర్క్ లో షూటింగ్స్ ఎలా పూర్తవుతాయో చూడాలి.


Post a Comment

Previous Post Next Post