శ్రీకాంత్ అడ్డాల 'అన్నాయ్'!


కొత్త బంగారు లోకం - ముకుంద - సీతమ్మ వాకిట్లో - సిరిమల్లెచెట్టు - బ్రహ్మోత్సవం వంటి కూల్ సినిమాలను అందించిన శ్రీకాంత్ అడ్డాల నారప్ప లాంటి సినిమా చేస్తాడని ఎవరు ఊహించలేదు. అసురన్ సినిమాకు రీమేక్ గా వస్తోంది అనగానే చాలా మార్పులు ఉంటాయని అనుకున్నారు గాని ఒరిజినల్ కు తగ్గట్లుగానే డిజైన్ చేసినట్లు ట్రైలర్ తోనే అర్ధమయ్యింది.

ఇక ఆ సినిమా అనంతరం శ్రీకాంత్ అడ్డాల ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే మరొక కథను అనుకుంటున్నాడు. ఆ సినిమాకు అన్నాయ్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశారు. గీతా ఆర్ట్స్ లోనే ఆ సినిమా ఉంటుందట. ఇక కథకు తగ్గట్లుగానే ఒక స్టార్ హీరో మంచి తనం కలిగిన అన్నాయ్ పాత్రలో కనిపిస్తాడని, త్వరలోనే ఆ ప్రాజెక్ట్ పట్టేలెక్కవచ్చని శ్రీకాంత్ వివరణ ఇచ్చాడు. ఇక నేడు అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోయే నారప్ప ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post