బ్యాక్ గ్రౌండ్ తో రావద్దని అనుకున్నా: వెంకీ కూతురు!


రీసెంట్ గా ఇన్ స్టాలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల లిస్టులో  (హోపర్ డాట్ కాం విడుదల చేసిన) వెంకటేష్ కూతురు ఆశ్రిత అంతర్జాతీయ స్థాయిలో 377వ స్థానంలో నిలిచింది. ఆసియాలో 27వ ర్యాంకు తెచ్చుకుంది. ఇన్ స్టాలో ఇన్ఫినిటీ ప్లాటర్ స్టార్ట్ చేసిన ఆశ్రిత ఫుడ్ అండ్ ట్రావెల్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళను ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది.

ఇక ఆమె ఫేమస్ అయ్యేవరకు కూడా వెంకీ కూతురు అని ఎవరికి తెలియదు. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న తరువాత వెంకటేష్ - రానా వంటి వారు మా ఇంట్లో అమ్మాయి అని చెప్పుకునే స్థాయికి వచ్చింది. ఇక ఇంట్లో రూల్ ప్రకారమే ఆశ్రిత బ్యాక్ గ్రౌండ్ తో సంబంధం లేకుండా క్రేజ్ అందుకుందట. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఇదే విధంగా చెప్పింది. నేను ఎవరో తెలియక ముందు నా కంటెంట్ చూసి మాత్రమే నన్ను ఫాలో అయినవారు చాలామంది ఉన్నారు. మమ్మల్ని మేం పరిచయం చేసుకునే క్రమంలో కుటుంబ పేరును.. వారికున్న ప్రతిష్ఠను ఏ మాత్రం వాడుకోకూడదని చిన్నప్పటి నుంచి నేర్పారు. అందుకే నా కుటుంబం పేరును వాడాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది.. అని ఆశ్రిత తెలిపింది.


Post a Comment

Previous Post Next Post