మహేష్ బాబు మూవీపై మరో క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి


మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది. ఇక అనిల్ మీద నమ్మకంతో ఆ సినిమా షూటింగ్ టైమ్ లోనే మహేష్ మరో కమిట్మెంట్ ఇచ్చాడు. అసలైతే ఒక సినిమా చేసిన తరువాత వెంటనే అనిల్ తో చేయాలి కానీ ఎందుకో సెట్టవ్వడం లేదు.

ఇక ఇటీవల దర్శకుడు అనిల్ మరోసారి క్లారిటీ ఇచ్చేశాడు. ఫుల్ స్క్రిప్ట్ కూడా మహేష్ బాబుకు చెప్పడం జరిగిందని అంటూ ఆ కథకు మహేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పాడు. అయితే హీరోగారు ఎప్పుడు చెబితే అప్పుడే సినిమా సెట్స్ పైకి వస్తుందని చెప్పిన అనిల్ ఆ భారం పూర్తిగా మహేష్ పైనే వేశాడు.  ఇక సర్కారు వారి పాట అనంతరం త్రివిక్రమ్ తో సినిమా చేయాలని అనుకుంటున్న మహేష్ ఆ తరువాత రాజమౌళితో కూడా ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. మరి ఈ గ్యాప్ లో అనిల్ సినిమా వస్తుందో లేదో చూడాలి.


Post a Comment

Previous Post Next Post