మా ఎన్నికలు.. మళ్ళీ బాలయ్య vs మెగాస్టార్?


మా ఎన్నికలు ప్రతిసారి కాంట్రవర్సీగానే స్టార్ట్ అవుతున్నాయి. కాంట్రవర్సీతోనే ముగుస్తున్నాయి. పెద్ద దిక్కు లేకపోవడంతో ఆర్టిస్టుల అసోసియేషన్ విభిన్న రకాలుగా చీలిపోవడం 'మా'కు ఒక పెద్ద మచ్చగా మారింది. ఇక ప్రస్తుతం మా ఎన్నికల్లో బాలయ్య vs మెగాస్టార్ అనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది.

బాలకృష్ణ అయితే ఇండస్ట్రీలో జరిగే తతంగాల్లో ఎక్కువగా పాల్గొనడు. ఇక మెగాస్టార్ అయినా అప్పుడప్పుడు ఎదో ఒక పనులలో కనిపిస్తుంటారు. అయితే ఈసారి మెగాస్టార్ మద్దతు ప్రకాష్ రాజ్ కు ఉన్నట్లు ఒక క్లారిటీ వచ్చేసింది. మరోవైపు బాలయ్య ఎవరికి మద్దతు ఇస్తారో తెలియదు గాని మెగాస్టార్ కు వ్యతిరేకంగానే వెళతారని తెలుస్తోంది. జీవిత రాజశేఖర్ కు ఆయనతో మంచి సాన్నిహిత్యం ఉంది కాబట్టి జీవిత ఎన్నికలో భరిలో ఉంటే బాలయ్య ఆమెకు మద్దతు ఇవ్వవచ్చని సమాచారం. ఇక నాగార్జున మాత్రం సేఫ్ జోన్ లో ఎన్నికల వైపు చూడకపోవడమే బెటర్ అని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post