అఖండ సర్ ప్రైజ్.. డేట్ ఫిక్స్!


బాలయ్యతో గతంలో సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం ఆయన తో తీస్తున్న మూడవ సినిమా అఖండ. మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా రేపు విడుదల తరువాత తప్పకుండా బ్లాక్ బస్టర్ కొట్టి బాలయ్య, బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ నమోదుకే చేయడం ఖాయం అని ఇన్నర్ వర్గాల సమాచారం. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. 

బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన రెండు లుక్స్ కి సంబందించిన టీజర్స్ నందమూరి ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకున్నాయి. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ ని వినాయక చవితి పండుగ కానుకగా సెప్టెంబర్ 10న విడుదల చేయాలని యూనిట్ నిర్ణయించిందట. అలానే సినిమాని దసరా కి విడుదల చేసే ఛాన్స్ ఉందని, త్వరలో దీనిపై అధికారిక న్యూస్ కూడా బయటకు రానున్నట్లు చెప్తున్నారు.


Post a Comment

Previous Post Next Post