పవన్ సినిమాలో కూడా మళ్ళీ ఆమెనే..?


ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, అలానే సాగర్ కె చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమాలు చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అతి త్వరలో మరొక రెండు సినిమాలు పట్టాలెక్కించనున్నారు. అయితే ముందుగా భీమ్లా నాయక్ మూవీ పూర్తి చేయనున్న పవన్ దానిని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రానా కూడా ఒక ముఖ్య పాత్ర చేస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ దీనిని నిర్మిస్తున్నారు. అనంతరం హరిహర వీరమల్లు షూట్ పూర్తి చేయనున్న పవన్ దానిని సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు టాక్. 

అయితే ఈ రెండు సినిమాల తరువాత త్వరలో గర్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించనున్న భారీ సినిమాతో పాటు ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి తీయనున్న మరొక సినిమాలు కూడా మొదలెట్టనున్నారు పవన్. అయితే వీటిలో హరీష్ శంకర్ సినిమా పూర్తి స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధం అయిందని, పవన్ ఇందులో ఒక పవర్ఫుల్ రోల్ చేయనుండగా ఆయనకు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపికయిందని లేటెస్ట్ ఫిలిం నగర్ వర్గాల సమాచారం. గతంలో తాను తీసిన డీజే, గద్దలకొండ గణేష్ సినిమాల్లో పూజా హెగ్డే నిర్ హీరోయిన్ గా తీసుకున్న హరీష్, ఈ మూవీలో కూడా నిజంగా ఆమెని మరొక్కసారి తీసుకున్నారా లేదా అనేది తెలియాలంటే అధికారిక న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయాలి. 


Post a Comment

Previous Post Next Post