పుష్ప నుండి మరో బిగ్ సర్ ప్రైజ్!


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ నటి రష్మిక మందన్న ల కలయికలో తెరకెక్కుతున్న తొలి సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా ఫహద్ ఫాసిల్, ధనుంజయ విలన్స్ గా కనిపించనున్నారు. 

ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ప్రీ లూడ్ టీజర్ అలానే దాక్కో దాక్కో మేక సాంగ్ రెండూ కూడా ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ దక్కించుకున్నాయి. అయితే లేటెస్ట్ టాలీవుడ్ ఫిలిం నగర్ న్యూస్ ప్రకారం ఈ సినిమా నుండి అల్లు అర్జున్, రష్మిక ల మధ్య సాగె ఒక అద్భుతమైన డ్యూయెట్ సాంగ్ ని త్వరలో విడుదల చేయనుందట యూనిట్. కాగా ఈ సాంగ్ వినాయక చవితి రోజున విడుదలయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే అందరిలో భారీగా అంచనాలు ఏర్పరిచిన ఈ పుష్ప సినిమా రేపు విడుదల తరువాత ఎంత మేర సక్సెస్ కొడుతుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post