పొలిటికల్ ఎంట్రీ పై మరోసారి క్లారిటీ ఇచ్చిన సోనూసూద్!


పలు భాషల సినిమాల్లో విలన్ గా నటించి మంచి పేరు దక్కించుకున్న బాలీవుడ్ నటుడు సోను సూద్, ఇటీవల కరోనా సమయంలో ఎందరో పేద సాదలకు తనవంతుగా సాయం అందించి తన గొప్ప మనసు చాటుకున్నారు. అంతేకాక కొద్దిరోజుల క్రితం తన ట్రస్ట్ ద్వారా కరోనా పేషంట్స్ కోసం ఉచితంగా ఆక్సిజన్ అందించేందుకు పలు ప్రాంతల్లో ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. 

ఆ విధంగా తన మంచి వ్యక్తిత్వంతో ఎంతో గొప్ప పేరు దక్కించుకున్న సోను సూద్, త్వరలో రాజకీయాల్లోకి రానున్నారు అంటూ ఇటీవల రూమర్స్ వచ్చాయి. అది మాత్రమే కాక మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సోను సూద్ ని రాబోయే ఎలక్షన్స్ లో మేయర్ అభ్యర్థిగా ప్రకటించనుంది అంటూ నేడు వచ్చిన ఒక వార్త పై స్పందించిన సోను సూద్, ఆ వార్త వాస్తవం కాదని, నిజానికి తనకు రాజకీయాల పట్ల ఏ మాత్రం ఆసక్తి లేదని, ప్రస్తుతం తనకు కామన్ మ్యాన్ గా గడుపుతున్న ఈ జీవితం తనకు ఎంతో సుఖాన్ని ఇస్తోంది అని తెలిపారు సోను.


Post a Comment

Previous Post Next Post