మెగాస్టార్ కోసం రచ్చ డైరెక్టర్ త్యాగం!


మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ప్రత్యేక  గౌరవం ఉంటుంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ దర్శకుల వరకు ఆయనతో సినిమా చేయాలనీ కలలు కంటారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా అభినందించడం ఆయనకు అలవాటే. ఇక ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా మెగాస్టార్ సింగిల్ సిట్టింగ్ లోనే కూల్ వాటిని పరిష్కరిస్తుంటారు. 

ఇటీవల లూసిఫర్ రీమేక్ కోసం గాడ్ ఫాదర్ అనే ఒక తెలుగు టైటిల్ ను అనుకున్నారు. అయితే ఆ టైటిల్ అంతకుముందే దర్శకుడు సంపత్ నంది ఒక మాస్ కమర్షియల్ సినిమా కోసం ఫిక్స్ చేసుకున్నాడు. టైటిల్ ను రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడంతో లూసిఫర్ టీం అతన్ని ప్రత్యేకంగా కలుసుకొని మాట్లాడడింది. మెగాస్టార్ సినిమా కావడంతో మరో ఆలోచన లేకుండా ఆ టైటిల్ ను త్యాగం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతేకాకుండా మెగాస్టార్ కూడా ప్రత్యేకంగా కలుసుకున్నాడు. గతంలో సంపత్ నంది రామ్ చరణ్ తో రచ్చ సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే.


Post a Comment

Previous Post Next Post