మా ఎలక్షన్స్ కి ముహూర్తం ఫిక్స్ !


ప్రతి ఏడాది కంటే ఈ సారి మూవీ ఆర్టిస్ట్స్ ఎలక్షన్స్ ఒకింత రసవత్తరంగా మారాయి. దానికి కారణం ప్రకాష్ రాజ్, విష్ణు, కాదంబరి కిరణ్, హేమ, జీవిత రాజశేఖర్, సివిఎల్ నరసింహారావు వంటి వారు పోటీలో నిలవడమే. ఎన్నడూ లేనంతగా ఒకేసారి ఇంతమంది అధ్యక్ష పదవి కోసం పోటీ పడడంతో వీరిలో ఎవరు గెలుస్తారో చూడాలని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ ఏడాది ఎలక్షన్స్ డేట్ విషయమై ఇప్పటివరకు ఎవరికీ క్లారిటీ లేకపోవడంతో ఒక్కొక్కరు ఒక్కొక్క తేదీ అని చెప్తూ వస్తున్నారు. 

అయితే వీటన్నిటినీ బ్రేక్ చేస్తూ మా అసోసియేషన్ లో సీనియర్ మెంబర్ సీనియర్ యాక్టర్ కృష్ణంరాజు నిన్న కోర్ కమిటీ సభ్యులు అందరితో కలిసి ఒక ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేయగా వారు సెప్టెంబర్ 12, 19, 26 డేట్స్ ని ఆయనకు సూచించడం జరిగిందట. అయితే వాటిలో 12వ తేదీ అనేది మరీ ఎర్లీ గా ఉంటుందని, అలానే 19 అయితే ఆ సమయంలో వినాయక నిమజ్జనాలు ఉండే ఛాన్స్ ఉందని, అందుకే 26వ తేదీ అయితే బెటర్ అని కృష్ణంరాజు ఆ రోజుని ఎన్నికల కోసం ఫిక్స్ చేసినట్లు టాక్. కాగా దీనిపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది.


Post a Comment

Previous Post Next Post