Pic Talk: పూరితో మరో ముగ్గురు దర్శకుల ముచ్చట్లు!


టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో లైగర్ సినిమా తీస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ షూటింగ్ ప్రస్తుతం ముంబై లో జరుగుతున్న సమయంలో మరొక ముగ్గురు దర్శకులు నిన్న పూరిని ప్రత్యేకంగా ఒక రెస్టారెంట్ లో కలిశారు. 

కాగా వారందరూ కలిసి రెస్టారెంట్ లో చిల్ అవుతున్న ఫోటోని లైగర్ కో ప్రొడ్యూసర్ చార్మీ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. అయితే ఆ ముగ్గరు ఎవరంటే, ఒకరు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు దర్శకుడు క్రిష్, మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ దర్శకుడు మోహన్ రాజా, అనుష్క శెట్టి నిశ్శబ్దం దర్శకుడు హేమంత్ మధుకర్. అయితే ఈ ముగ్గరు పూరి తో కలిసి ఏమి మాట్లాడుతున్నారో చెప్పగలరా అంటూ ఛార్మి సరదాగా పోస్ట్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎంతో వైరల్ అవుతోంది. మరి ఇంతకీ వాళ్ళు ముగ్గరూ ఏమి మాట్లాడుతున్నారో మీరైనా చెప్పగలరా ఫ్రెండ్స్.

Post a Comment

Previous Post Next Post