ప్రశాంత్ నీల్ మరో టాలీవుడ్ డీల్ సెట్టయినట్లే?


ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ అనే భారీ పాన్ ఇండియా సినిమా తీస్తున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్, మూడేళ్ళ క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా సినిమా కెజిఎఫ్ చాప్టర్ 1 సూపర్ సక్సెస్ తో జాతీయ స్థాయిలో అందరి నుండి బాగా పేరు దక్కించుకున్నారు. ఇక ఇటీవల ఆయన తీసిన కెజిఎఫ్ చాప్టర్ 2 మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది. 

వీటి అనంతరం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ తో ఒక మూవీ కోసం ఇప్పటికే ఒప్పందం చేసుకున్న  ప్రశాంత్ నీల్, లేటెస్ట్ ఫిలిం నగర్ న్యూస్ ప్రకారం ఆ తరువాతి మూవీని సూపర్ స్టార్ మహేష్ తో చేయనున్నట్లు సమాచారం. ఇటీవల మహేష్ కి ఒక అద్భుతమైన స్టోరీ వినిపించి ఆయన నుండి గ్రీన్ సిగ్నల్ అందుకున్న ప్రశాంత్ నీల్, ఆ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించనున్నట్లు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ న్యూస్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.


Post a Comment

Previous Post Next Post