Subscribe Us

భారతీయుడు 2.. గుడ్ న్యూస్!


లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ తో చేస్తున్న సినిమా విక్రమ్. ఎంతో భారీ వ్యయంతో నిర్మితం అవుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే ఇటీవల శంకర్ దర్శకత్వంలో కమల్ హీరోగా ప్రారంభమైన భారీ పాన్ ఇండియా మూవీ భారతీయుడు 2, అర్ధాంతరంగా షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే. 

నిర్మాతలకు, దర్శకుడు శంకర్ కి మధ్య వచ్చిన బేధాభిప్రాయాల వలన నిలిచిపోయిన ఈ సినిమా విషయమై నేడు కమల్ ఒక తీపి కబురు చెప్పారు. త్వరలో దర్శకుడు శంకర్, అలానే భారతీయుడు నిర్మాతల మధ్య సయోధ్య కుదుర్చేందుకు తాను ప్రయత్నిస్తానని, అలానే ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూట్ త్వరలో మొదలు పెట్టి వీలైనంత త్వరగా దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు  ప్రయత్నిస్తాం అని అన్నారు కమల్.


Post a Comment

0 Comments