మరో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న మంచు మనోజ్!


మంచు మనోజ్ ప్రస్తుతం అహం బ్రహ్మాస్మి అనే సినిమాని చేస్తున్నారు. ఎం ఎం ఆర్ట్స్ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థని నెలకొల్పి ఆ సంస్థలో తొలి వెంచర్ గా మనోజ్ చేస్తున్న ఈ సినిమాకి శ్రీకాంత్ రెడ్డి దర్శకుడు. ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కొన్నాళ్లుగా కోవిడ్ ఇబ్బందుల కారణంగా వాయిదా పడింది. అయితే తమ సినిమా పూర్తిగా ఆగిపోలేదని, త్వరలో పరిస్థితులు అన్ని చక్కబడిన అనంతరం బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసి సినిమాని థియేటర్స్ లోకి తీసుకువస్తాం అంటూ ఇటీవల తిరుమల వచ్చిన సందర్భంగా మీడియాతో చెప్పారు మనోజ్. 

ఇక ఒక వారం క్రితం ప్రత్యేకంగా తెలంగాణ టూరిజం వారితో ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన మనోజ్, ప్రస్తుతం తాను ఒక సరికొత్త ప్రాజెక్ట్ కోసం సిద్ధం అవుతున్నానని, దాని ద్వారా నిరుద్యోగులైన అనేకమంది యువతకి కొంత మేర అయిన ఉపాధి దొరుకుతుందని అంటున్నారు. అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం మనోజ్ నుండి రాబోయే దసరా పండుగ సందర్భంగా ఒక పెద్ద అనౌన్స్ మెంట్ రానుందని, ఆపై ఆయన ఒకదానివెంట మరొకటి సినిమాలు అనౌన్స్ చేస్తారని ఆయన సన్నిహితుల చెప్తున్నట్లు తెలుస్తోంది.


Post a Comment

Previous Post Next Post