జగ్గూభాయ్ హవా మామూలుగా లేదు.. 9 క్రేజీ ప్రాజెక్ట్స్!


టాలీవుడ్ విలక్షణ నటుడు ఆర్టిస్ట్ జగపతి బాబు ఇటీవల కాలంలో నటుడిగా అనేక సినిమా ఛాన్స్ లు దక్కించుకుంటున్నారు. బాలకృష్ణ తో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తీసిన లెజెండ్ మూవీతో విలన్ అవతారమెత్తిన జగపతి బాబు అక్కడి నుండి మరింత మంచి పేరు సంపాదించారు. ఇక ప్రస్తుతం ఆయనకు ఏకంగా తొమ్మిది క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కడం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది.

కాగా  ఆయన ప్రస్తుతం నాని హీరోగా శివ నిర్వాణ తీస్తున్న టక్ జగదీశ్, రజినీకాంత్ తో సక్సెస్ఫుల్ డైరెక్టర్ శివ తీస్తున్న భారీ మూవీ అన్నాత్తె, కన్నడలో శ్రీమురళి నటిస్తున్న లేటెస్ట్ మూవీ మదగజ, సూపర్ స్టార్ మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా చేస్తున్న ఫస్ట్ మూవీ హీరో, శర్వానంద్ సిద్దార్ధ నటిస్తున్న మహా సముద్రం, యువ నటుడు నాగశౌర్య నటిస్తున్న లక్ష్య, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న గని, సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న రిపబ్లిక్, అలానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్ వంటి సినిమాల్లో పలు ముఖ్య రోల్స్ చేస్తున్నారు జగపతి బాబు. అయితే ఇవి మాత్రమే కాకుండా ఆయన నటించనున్న మరొక రెండు భారీ ప్రాజక్ట్స్ కి సంబంధించి కూడా అధికారిక ప్రకటనలు త్వరలో రానున్నట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post