NTR Koratala Siva Movie Latest Update !!


యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీసిన జనతా గ్యారేజ్ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా వచ్చిన దాదాపుగా ఐదేళ్ల తరువాత త్వరలో మరొక్కసారి ఎన్టీఆర్ తో తన నెక్స్ట్ మూవీ తీయనున్నారు కొరటాల శివ. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలపై నిర్మితం కానున్న ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇటీవల వచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తుండగా, అటు కొరటాల శివ మెగాస్టార్ తో ఆచార్య మూవీ చేస్తున్నారు.

అయితే మరోవైపు ఎన్టీఆర్ మూవీ కోసం ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసిన కొరటాల, దసరా అనంతరం అక్టోబర్ రెండవ వారంలో ఈ మూవీని పట్టాలెక్కించడానికి ముహూర్తం ఫిక్స్ చేసారని, త్వరలో దీనికి సంబంధించి అఫీషియల్ స్టేట్మెంట్ త్వరలో రానుందని టాక్. కాగా ఈ మూవీకి కోలీవుడ్ యువ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించనున్నారని, అలానే ఒక బాలీవుడ్ భామ ఇందులో ఎన్టీఆర్ కి జోడీగా నటించనుందని సమాచారం.


Post a Comment

Previous Post Next Post