సలార్ లో విలన్ గా క్రేజీ యాక్టర్!!


రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ ప్రస్తుతం తీస్తున్న సినిమా సలార్. శృతి హాసన్ తొలిసారిగా ప్రభాస్ కి జోడీగా యాక్ట్ చేస్తున్న ఈ సినిమాని హోంబలె ఫిలిమ్స్ వారు ఎంతో భారీగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తుండగా రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 1970ల బ్యాక్ డ్రాప్ లో సాగె మూవీ గా తెరకెక్కుతున్నట్లు టాక్. భారీ మాస్, యాక్షన్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెయిన్ విలన్ గా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో మంచి పేరు దక్కించుకున్న మనోజ్ బాజ్పాయ్ నటించనున్నారు అనేది లేటెస్ట్ గా ఫిలిం నగర్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్న న్యూస్.

గతంలో సుమంత్ హీరోగా తెరకెక్కిన ప్రేమకథ మూవీలో విలన్ గా చేసి ఆ తరువాత అల్లు అర్జున్ నటించిన హ్యాపీ మూవీలో కూడా ఒక కీలక రోల్ చేసారు మనోజ్. అనంతరం పవర్ స్టార్ కొమరం పులి మూవీలో మెయిన్ విలన్ గా నటించి మంచి పేరు దక్కించుకున్న మనోజ్ దాదాపుగా పదకొండేళ్ల గ్యాప్ తరువాత ప్రభాస్ సలార్ మూవీ ద్వారా టాలీవుడ్ ఆడియన్స్ ని పలకరించనున్నారు. కాగా సలార్ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Post a Comment

Previous Post Next Post