అసలు నాని చేసిన తప్పేంటి.. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?


ఇటీవల జరిగిన ఏపీ తెలంగాణ ఎగ్జిబీటర్స్ సమావేశంలో అందరూ హీరో నానిని ప్రత్యేకంగా టార్గెట్ చేయడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతే కాకుండా నానికి ఇండస్ట్రీలో ఎవరి నుంచి కూడా కనీస మద్దతు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే నాని ఇలాంటి తప్పు చేయకపోయినా అతన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి భవిష్యత్తులో సినిమాలను థియేటర్స్ లోకి రాకుండా చేస్తామని చెప్పడం కూడా బాధాకరమైన చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

ఇక ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్స్ నడవడం చాలా కష్టమైన తరుణంలో థియేటర్స్ లో ఎవ్వరు కూడా సినిమాలని రిలీజ్ చేయవద్దు అని ఎగ్జిబీటర్స్ గత కొంతకాలంగా బాగానే బ్రతిమాలారు కానీ కొందరు పరిస్థితులను అర్థం చేసుకోకుండా సినిమాలను విడుదల చేశారు. మరికొందరు డైరెక్టుగా ఓటీటీలో సినిమాలను విడుదల చేస్తున్నారు. దీనివల్ల ఎగ్జిబీటర్స్ చాలా నష్టపోవాల్సి వస్తోంది. అయితే టక్ జగదీష్ నిర్మాతలు తీసుకున్న నిర్ణయం వలన నాని తీవ్రమైన ఇబ్బందుల్లో పడ్డాడు.

ప్రస్తుతం థియేట్రికల్ బిజినెస్ కస్థల్లో ఉన్న సమయంలో ఏషియన్ అధినేత సునీల్ నారంగ్ నిర్మించిన లవ్ స్టోరీ సినిమాను సెప్టెంబర్ 10న విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అదే రోజు నాని టక్ జగదీష్ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. సినిమాను థియేటర్స్ లో విడుదల చేయకపోవడమే కాకుండా మళ్ళీ థియేటర్స్ లో వస్తున్న సినిమాకు పోటీగా ఓటీటీలో తన సినిమాను రిలీజ్ చేయించడం చాలా బాధాకరం అని ఎగ్జిబీటర్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 

నాని నిర్మాతలతో మాట్లాడి ఆ డేట్ ను మారిస్తే బావుంటుందని అంటున్నారు. లేకుంటే భవిష్యత్తులో నానికి సంబంధించిన సినిమాలను థియేటర్స్ లో విడుదల కానివ్వమని కూడా ఇన్ డైరెక్ట్ గా హెచ్చరికలు పంపుతున్నారు. అయితే నిజానికి ఈ వివాదంతో నానికి ఎలాంటి సంబంధం లేదు. అసలు టక్ జగదీష్ సినిమాను థియేట్రికల్ గానే విడుదల చేయించాలని చాలా ప్రయత్నాలు చేశాడు కానీ నిర్మాతల ఆర్థిక కారణాల వలన మంచి ఆఫర్ రావడంతో వారు సొంత నిర్ణయంతో విడుదల చేసుకోవాల్సి వచ్చింది. ఆ విషయంలో నాని ఒక వివరణ కూడా ఇచ్చాడు. ఇక ఇండస్ట్రీలో నానికి ఎవరు సపోర్ట్ చేయకపోవడం బాధాకరం. అభిమానులు మాత్రమే నానికి సోషల్ మీడియా ద్వారా మద్దతు ఇస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post