మెగాస్టార్ వరుస మూవీ లైనప్..టైటిల్స్ ఫిక్స్!


ఇటీవల ఖైదీ నెంబర్ 150 మూవీతో చాలా గ్యాప్ తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి, ఆ తరువాత చేసిన సినిమా సైరా నరసింహారెడ్డి. ఈ మూవీ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం తన తనయుడు చరణ్ తో కలిసి మెగాస్టార్ చేస్తున్న సినిమా ఆచార్య. కొరటాల శివ తీస్తున్న ఈ సినిమా జనవరి లో విడుదల కానున్నట్లు టాక్. అయితే దీని తరువాత 153వ సినిమాని మోహన్ రాజా తో చేయన్నారు మెగాస్టార్. లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కనున్న ఈ మూవీకి గాడ్ ఫాదర్ అనే టైటిల్ అనుకుంటున్నారు.

అలానే ఆ తరువాత యువ దర్శకుడు బాబీ తో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై చేయబోయే 154వ సినిమాకి యాక్షన్ ఎంటర్టైనర్ కి భోళా శంకర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు టాక్. ఇక ఆపై మరొక దర్శకుడు మెహర్ రమేష్ తో చేయనున్న 155వ మూవీకి వేదాళం మూవీ తెలుగు రీమేక్ కి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు చెప్తున్నారు. ఆ తరువాత 156వ సినిమా గా మారుతీ దర్శకత్వంలో యువి క్రియేషన్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మించనున్న మూవీని మెగాస్టార్ చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా తన నెక్స్ట్ సినిమాలను అప్పుడే పూర్తి స్థాయిలో అటు స్టోరీ లతో పాటు ఇటు టైటిల్స్ తో సహా లైన్లో పెట్టిన మెగాస్టార్ చిరంజీవి యువ హీరోల కంటే స్పీడ్ గా ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు.


Post a Comment

Previous Post Next Post