పుష్ప ఫుల్ సాంగ్ లీక్.. ఇది తెలివైన లీక్?


మాస్టర్ మైండ్ తో ఆలోచించే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సినిమా ప్రమోషన్ లో కూడా చాలా విభిన్నంగా ఉంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈసారి మొదటి పాన్ ఇండియా సినిమా పుష్పపై మంచి హైప్ క్రియేట్ చేయాలని ప్లాన్ గట్టిగానే వేశారు. అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్ర కు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ఏ స్థాయిలో హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇక మొదటి పాటతో కూడా అదే స్థాయిలో 5 భాషల్లో రిలీజ్ చేసి అంచనాలను పెంచాలని అనుకున్నారు. అయితే తెలుగు  పాటకు సంబంధించిన ఆడియో రికార్డ్ సోషల్ మీడియాలో లీక్ అవ్వడం వైరల్ గా మారింది. దేవి శ్రీ ప్రసాద్ గాత్రంతో ఉన్న ఆ పాట గత రాత్రి నుంచి కూడా వాట్సాప్ లో కూడా చక్కర్లు కొడుతోంది. ఒక విధంగా ఈ లీక్ విషయంలో పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాటను ఒరిజినల్ గా పాడింది సింగర్ శివమ్. సాధారణంగా ఇలాంటి పాటను కంపోజ్ చేసిన కూడా దేవి ముందుగానే ఇలా రెడీ చేసుకుంటాడు. అందులో భాగంగానే దాక్కో దాక్కో మేక పాటను రెడీ చేసినట్లుగా అనిపిస్తోంది. అలాగే ఈ పాట కావలని లీక్ చేశారనే ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇ రోజు విడుదల కాబోయే ఒరిజినల్ సాంగ్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post