సైరా, ఉప్పెన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి టాలీవుడ్ లో మరిన్ని ఆఫర్స్ అందుకుంటున్నాడు. అయితే ఛాన్స్ లు ఎన్ని వస్తున్నా కూడా సేతుపతి మాత్రం అస్సలు టెంప్ట్ అవ్వడం లేదు. వీలైనంత వరకు తనకు నచ్చిన సినిమాలను మాత్రమే చేస్తున్నాడు. ఇక కొన్నిసార్లు డేట్స్ అడ్జస్ట్ చేయలేక కూడా ఛాన్సులను వదులుకోవాల్సి వస్తోంది.
ఇక రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ సినిమాలో మరో ఛాన్స్ అందుకున్నట్లు టాక్ వస్తోంది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య 107వ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రానున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్రలో విజయ్ సేతుపతి నటించే అవకాశం ఉందట. దర్శకుడు ఇదివరకే ఈ టాలెంటెడ్ యాక్టర్ ను సంప్రదించినట్లు టాక్ గట్టిగానే వస్తోంది. కానీ విజయ్ మాత్రం డేట్స్ విషయంలో కాస్త ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @TBO_Updates
Post a Comment