బాలీవుడ్ లోకి మరో తెలుగు దర్శకుడు!


బాలీవుడ్ ఇండస్ట్రీ లో బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాల అనంతరం చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు తెలుగు సినిమాలంటే బాలీవుడ్ సెల్రిటీలలో చిన్నచూపు ఉండేది. ఇక ఎప్పుడైతే బాహుబలి సంచలన విజయాన్ని అందుకుందో అప్పటి నుంచి దర్శకులకు డిమాండ్ కూడా పెరిగింది. ఇక అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ సినిమాతో సందీప్ రెడ్డి వంగా అక్కడ మరో ఆఫర్ అందుకున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు జెర్సీ సినిమా తో గౌతమ్ తిన్ననూరి కూడా వండర్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే బాటలో రాక్షసుడు డైరెక్టర్ రమేష్ వర్మ కూడా వెళ్లనున్నట్లు టాక్ వస్తోంది. రాక్షసుడు సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న కొత్త ప్రాజెక్టు పై బాలీవుడ్ హీరోల కన్ను పడింది. మొదట ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ హీరోతోనే పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించాలని అనుకున్నారు. ఇక ఇప్పుడు ప్రాజెక్టులోకి అక్షయ్ కుమార్ వచ్చినట్లు తెలుస్తోంది. టాలెంటెడ్ దర్శకులకు ఎక్కువగా సపోర్ట్ చేసే అక్షయ్ కుమార్ రమేష్ వర్మ గురించి తెలుసుకుని రాక్షసుడు 2 సినిమాలో నటించడానికి ట్రై చేస్తున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం రమేష్ వర్మ కిలాడి సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.


Post a Comment

Previous Post Next Post