నెంబర్ వన్ రెమ్యురేషన్ పై బాహుబలి రైటర్ స్ట్రాంగ్ ఆన్సర్!


దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తండ్రి కే విజయేంద్రప్రసాద్ రాసే కథలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు సింహాద్రి నుంచి RRR వరకు ఎలాంటి కథలు రాసినా కూడా బాక్సాఫీస్ స్థాయిని పెంచేలా గుర్తింపు అందుకుంటున్నాయి. అందుకు రాజమౌళి ఆయనకు ఒక ప్రత్యేకమైన ఆయుధంలా నిలుస్తున్నారు. 

బాహుబలి RRR వంటి కథలకు మొదటి బీజం వేసిన స్టార్ రైటర్ పారితోషికం ఏ స్థాయిలో ఉంటుంది అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో విజయేంద్రప్రసాద్ 'నెంబర్ వన్ రెమ్యునరేషన్ అందుకుంటున్న రైటర్ మీరే కదా?' అనే ప్రశ్నకు తెలివైన ఆన్సర్ ఇచ్చారు. నాది ఎక్కువ రెమ్యునరేషన్ అనేది నాకు తెలియదు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు అనేది అసలు తెలియదు. వాళ్ల గురించి తెలిసినప్పుడు నాకు వస్తున్నది ఎక్కువనా కదా అనే విషయంలో నాకు ఒక క్లారిటీ వస్తుంది.. అని స్ట్రాంగ్ గా వివరణ ఇచ్చారు. ఇక ప్రస్తుతం సీతమ్మ తల్లి పాత్ర పై ఒక కథను రాస్తున్నట్లు తెలియజేశారు.


Post a Comment

Previous Post Next Post