మరొక్కసారి ఆ వెబ్ సిరీస్ లో సందీప్ కిషన్ !


ఇటీవల తాను సొంతంగా బ్యానర్ నెలకొల్పి నిర్మించిన ఏ1 ఎక్స్ ప్రెస్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టిన యువ నటుడు సందీప్ కిషన్, ప్రస్తుతం నటిస్తున్న సినిమా గల్లీ రౌడీ. నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి జి నాగేశ్వర రెడ్డి దర్శకుడు. అయితే ఈ సినిమా తరువాత త్వరలో అమెజాన్ వారు త్వరలో నిర్మించనున్న ప్రముఖ వెబ్ సిరీస్ ఫ్యామిలి మ్యాన్ 3 లో ఒక ముఖ్య పాత్ర చేయబోతున్నట్లు సందీప్ కిషన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా వెల్లడించారు. 

గతంలో ఫ్యామిలీ మ్యాన్ 1 లో మేజర్ విక్రమ్ అనే పాత్రలో కొన్ని క్షణాలు కనిపించి అందరినీ తన నటనతో ఆకట్టుకున్న సందీప్ ఈ సీజన్ లో మరింత పెద్ద రోల్ చేయనున్నట్లు తెలుస్తుంది. కాగా దీనికి సంబంధించి త్వరలో అఫీషియల్ గా పూర్తి వివరాలు వెల్లడి కానున్నట్లు సమాచారం. మరి మరొక్కసారి ఈ వెబ్ సిరీస్ ద్వారా సందీప్ ప్రేక్షకులని ఎంతవరకు ఆకట్టుకుంటారో చూడాలి.


Post a Comment

Previous Post Next Post