19 నవంబర్ 2018న ఆఫీషియల్ గా షూటింగ్ ప్రారంభమైన ఆర్ఆర్ఆర్ సినిమా నేటితో సక్సెస్ఫుల్ గా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. కేవలం సినిమాకి సంబంధించి కొన్ని పికప్ షాట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయట. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీం గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న విషయం తెలిసిందే.
పీరియాడిక్ డ్రామా మూవీగా రూపొందిన ఈ సినిమాలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ ఇలా అనేక భాషలకు చెందిన నటులు కీలక పాత్రలు చేశారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఒలీవియా మోరిస్, అలియా భట్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. అయితే ఆసక్తికర విషయం ఏమిటంటే షూటింగ్ ఫస్ట్ షాట్ బైక్ మీదనే తీశామని, అదే విధంగా లాస్ట్ షాట్ ని కూడా బైక్ మీదనే తీయడం జరిగిందని యూనిట్ వెల్లడించింది. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి లో విడుదల కానున్నట్లు టాక్.
Follow @TBO_Updates
Post a Comment