రామ్ చరణ్ తమన్నాల గొడవ?


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థపై రూపొందుతున్న ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీం గా కనిపించనున్నారు.

అయితే ఈ మూవీ తరువాత శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ఒక భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్నారు రామ్ చరణ్. థమన్ సంగీతం అందించనున్న ఈ సినిమా మరొక నెలలో సెట్స్ మీదకు వెళ్లనుండగా ఈ మూవీలో మెయిన్ విలన్ వైఫ్ పాత్ర లో మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించనున్నారని, ఒకానొక సన్నివేశంలో హీరో చరణ్ కి అలానే తమన్నా కి మధ్య మాటల వాగ్వివాదం జరిగే సన్నివేశం ఉందని అంటున్నారు. ఇప్పటికే నితిన్ హీరోగా యాక్ట్ చేస్తున్న మ్యాస్ట్రో సినిమాలో నెగటివ్ రోల్ చేస్తున్న తమన్నా చరణ్ సినిమాలో కూడా పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే చేశారనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ న్యూస్ పై అధికారికంగా ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.


Post a Comment

Previous Post Next Post