ప్రభాస్ ఆదిపురుష్ మూవీ కి అసలు సమస్య అదేనా..?


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవూడ్ డైరెక్టర్ ఓం రౌత్ తీస్తున్న తాజా మైథలాజికల్ సినిమా ఆదిపురుష్. కాగా ఇందులో ప్రభాస్ రాముడిగా యాక్ట్ చేస్తుండగా కృతి సనన్ సీత గా అలానే సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నారు. బాలీవూడ్ భారీ నిర్మాణసంస్థ టి సిరీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా ఒక విషయమై ఆదిపురుష్ యూనిట్ కొంత సమస్యల్లో ఇరుక్కుంది అనేది లేటెస్ట్ టాలీవుడ్ బాలీవుడ్ వర్గాల టాక్. 

ఎంతో భారీ ఎత్తున పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ డైరెక్టర్ ఓం రౌత్ తో ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భగవత్ తో ఇటీవల సమావేశమయ్యారని, ఆ సమయంలో తమ సినిమా కథని ఆయనకు వినిపించగా మోహన్ భగవత్ స్టోరీ విషయమై కొంత అభ్యంతరాలు చెప్పారని, కాగా దాని ప్రకారం కథలో కొంత మార్పులు చేయాలా లేదా అనే ఆలోచనలో టీమ్ ఉందని, ప్రస్తుతం ఇది ఆదిపురుష్ యూనిట్ కి కొంత సమస్యాత్మకంగా మారిందని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాల వారు. శ్రీరాముడి కథగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగష్టు లో ప్రేక్షకుల ముందుకు రానుంది...!!


Post a Comment

Previous Post Next Post