టక్ జగదీష్ ఓటీటీ గోల.. ఆ రోజు కోసమే ఎదురుచూపులు!


లాక్ డౌన్ కారణంగా టాలీవుడ్ లో చాలా సినిమాలు OTT ప్రపంచంలోనే రిలీజ్ అయ్యాయి. వెయిట్ చేయడం ఎందుకని చాలామంది నిర్మాతలు థియేటర్ బిజినెస్ కు స్వస్తి పలుకుతున్నారు పెట్టిన బడ్జెట్ వచ్చినా కూడా డైరెక్ట్ గా అమెజాన్ హాట్ స్టార్ లాంటి పోటీ కంపెనీలకు అమ్మేస్తున్నారు. జగదీష్ కూడా అదే తరహాలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వెలువడుతున్నాయి. 

నిజానికి అమెజాన్ ప్రైమ్ నాని సినిమా కోసం గత ఏడాది నుంచి ప్రయత్నాలు చేస్తోంది. టెంప్ట్ అయ్యే రేటును కూడా ఆఫర్ చేశారు. అయితే నిర్మాతలు ఈ నెల 7వరకు ఎదురు చూడాలని అనుకుంటున్నారు. ఆంద్రప్రదేశ్ లో టికెట్స్ రేట్స్ పై మంత్రి వర్గ సమావేశంలో చర్చలు జరగనున్నాయి. ఆ మీటింగ్ లోనే ఎదో ఒక నిర్ణయం తీసుకుంటారట. ఒకవేళ రేట్లు అదే తరహాలో కొనసాగితే ఇక ఓటీటీ తప్ప మరో దారి లేదని నిర్మాతలు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post