నిహారిక భర్తపై కేసు.. రంగంలోకి నాగబాబు!


నిహారిక భర్త చైతన్య పై ఇటీవల వారి అపార్ట్‌మెంట్ భవనం నివాసికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇబ్బందుల్లో పడ్డాడు.  అతను తన ఫ్లాట్‌కు పెద్ద సంఖ్యలో స్నేహితులను  తీసుకువచ్చి రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లో పార్టీలను నిర్వహించి ఇబ్బందిలకు గురి చేస్తున్నాడని వారు ఆరోపించారు.

నిహారిక గత ఏడాది మార్చిలో ఫిల్మ్‌నగర్ - షేక్‌పేట్ రోడ్‌లో ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుంది. అయితే ఆ అపార్ట్మెంట్ లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నందు వల్ల పోలీసులను ఆశ్రయించారు. అందుకు ప్రతీకారంగా, తన గోప్యతను ఉల్లంఘించినందుకు చైతన్య వారిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా వేశాడు.  ఈ విషయం తెలుసుకున్న తర్వాత, నాగ బాబు తన మనుషులను అపార్ట్‌మెంట్ నివాసులతో మాట్లాడటానికి పంపినట్లు తెలుస్తోంది. వారి సమస్యలను పరిష్కరిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారట. వారు ఫిర్యాదులను ఉపసంహరించుకునేలా నాగబాబు చర్చలకు సిద్ధమైనట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post